విమానాల కొనుగోలు ఆర్డర్ తో అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ

  • భారత్ వృద్ధి అమెరికన్లకు ప్రయోజనకరమన్న ప్రధాని
  • మన సహకారానికి హద్దుల్లేవని వ్యాఖ్య
  • భారత ప్రధాని ప్రసంగానికి సభ్యుల జేజేలు 
అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాన్ని ప్రధాని మోదీ చక్కగా వినియోగించుకున్నారు. భారత్-అమెరికా మధ్య బంధం ఇరు దేశాల ప్రయోజనాలకు, ప్రపంచ ప్రగతికి ఎంత ముఖ్యమో వివరించే ప్రయత్నం చేశారు. మోదీ ప్రసంగం గంట పాటు సాగింది. భారత ప్రధాని ప్రసంగాన్ని అమెరికన్ ప్రజా ప్రతినిధులు బాగా మెచ్చుకున్నారు. 70 సార్లకు పైగా చప్పట్లతో అభినందించారు. మధ్యలో పలు పర్యాయాలు సభ్యులంతా లేచి నిలబడి గౌరవం చాటారు. మోదీ.. మోదీ అనే నినాదాలు వినిపించాయి. 

‘‘భారత్ లో డిఫెన్స్, ఏరో స్పేస్ వృద్ధి చెందిన కొద్దీ వాషింగ్టన్, అరిజోనా, జార్జియా, అల్బామా, సౌత్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అమెరికన్ కంపెనీలు వృద్ధి చెందుతుంటే.. భారత్ లోని వారి పరిశోధన, అభివృద్ది  కేంద్రాలు ఫరిడవిల్లుతాయి. భారతీయులు మరింత మంది విమానాల్లో ప్రయాణిస్తే.. ఒక్క విమానాల కొనుగోలు ఆర్డర్ తో అమెరికాలోని 44 రాష్ట్రాల పరిధిలో 10 లక్షల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మన పరస్పర సహకారానికి ఎలాంటి హద్దుల్లేవు. మన సమన్వయం పరిమితి లేనిది’’ అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగంతో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల మనసు చూరగొన్నారు.


More Telugu News