ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి
- మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన
- ఇంట్లో ఉన్న మహిళను బయటకు లాకొచ్చాడంటూ బాధితుల ఆరోపణ
- తానో హైకోర్టు అడ్వొకేట్ అని చెప్పుకుంటూ బెదిరించాడని ఆరోపణ
- బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఇంటి ముందు చెత్త వేసిన మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడికి తెగబడ్డాడు. మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మూసారాంబాగ్‌లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఆంటోని రెడ్డి అలియాస్ క్రాంతి రెడ్డి నివాసముంటున్నాడు. తాజాగా అతడు తన ఇంటి ముందు చెత్తవేశారంటూ ఓ మహిళ, యువకుడిపై దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న మహిళను చేతులుపట్టి బయటకు లాక్కొచ్చాడు. అతడిని అడ్డుకున్న వారిపై కూడా దాడికి దిగాడు. వారిపై పిడిగుద్దులు కురిపించాడు.
ఈ క్రమంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడ్వొకేట్ దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తమ ముఖాలపై పిడిగుద్దులు కురిపించాడని బాధితులు ఈ సందర్భంగా వాపోయారు. కడుపులో తన్నాడని ఆరోపించారు.