పుట్టిన బిడ్డల్ని చంపేసి, ఏళ్లపాటు ఫ్రిజ్‌లో దాచిపెట్టిన తల్లి
- 2018, 2019లో పుట్టిన ఇద్దరు నవజాత శిశువుల్ని చంపిన మహిళ
- డెలివరీ రికార్డ్స్ ఉండి, పేర్లు నమోదు కాకపోవడంతో అధికారుల అనుమానం
- ఆరాతీయగా హత్య చేసినట్లు చెప్పిన మహిళ
దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన నవజాత శిశువులను ఇద్దరిని చంపేసి, ఏళ్ల కొలది ప్రిజ్ లో భద్రపరిచినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వారెంట్ తో సదరు మహిళను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం సువాన్ నగరానికి చెందిన మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెను చంపి ఫ్రిజ్ లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టగా అంతే కర్కశంగా వ్యవహరించింది.
ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నాయి. కానీ పిల్లల పేర్లు నమోదు చేసినట్లు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మే నెలలో ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. తన నవజాత శిశువులను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయవలసి వచ్చిందని తెలిపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్యల గురించి తనకు తెలియదని ఆ మహిళ భర్త చెప్పాడు. ఆ రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నట్లు తనతో భార్య చెప్పిందని అతను చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టిన తర్వాత నవజాత శిశువును గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లో ఫ్రీజర్‌లో భద్రపరిచింది. ఆ మహిళ తన ఐదవ బిడ్డను కూడా అదే పద్ధతిలో హత్య చేసింది.
అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మొదట ఆమె పోలీసుల దర్యాఫ్తుకు సహకరించలేదు. సెర్చ్ వారెంట్ తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్ లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి.
కాగా, 2022లో ఇలాంటి కేసులో, జియోంగ్గి ప్రావిన్స్‌లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల పాటు కంటైనర్‌లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 నెలల కూతురు చనిపోయాక ఆ దంపతులు మూడేళ్లపాటు దాచిపెట్టారని అప్పుడు పోలీసులు తెలిపారు.