ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై రాజ్ భవన్లను ప్రయోగిస్తున్నారు: మమతా బెనర్జీ

  • పాట్నాలో విపక్షాల సమావేశం
  • హాజరైన మమతా బెనర్జీ
  • కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తిన బెంగాల్ సీఎం
  • రాజ్ భవన్ కేంద్రంగా ప్రత్యామ్నాయ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై రాజ్ భవన్ ను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్ కేంద్రంగా ప్రత్యామ్నాయ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. సామాన్యుల బాధలు కేంద్రానికి పట్టవని, రాష్ట్రాలకు నిధుల విడుదలలో పక్షపాతం చూపిస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీజేపీ నల్ల చట్టాలను ప్రయోగిస్తోందని, తాము కూడా దేశభక్తులమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడతామని అన్నారు. పాట్నాలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీకి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆమె పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News