పులియబెట్టిన పదార్థాలు తింటున్నారా..?

  • పులిసిన ఆహారాలతో ఆరోగ్య ప్రయోజనాలు
  • పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది
  • దీంతో పలు అనారోగ్యాలకు పరిష్కారం
గతంతో పోలిస్తే ఆరోగ్యం పట్ల నేడు కాస్తంత అవగాహన పెరుగుతోంది. కానీ, ఆహార నియమాల్లోనే చాలా మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా పులియబెట్టిన ఆహార పదార్థాలను మన పూర్వీకులు విరివిగా వినియోగించేవారు. దాదాపు ఎలాంటి దీర్ఘకాలిక సమస్యల్లేకుండా వారు ఆరోగ్యంగా జీవించడం వెనుక కారణాల్లో ఇది కూడా ఒకటి. అందుకే మనం కూడా వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

  • పులియబెట్టిన ఆహార పదార్థాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో మన శరీరంలో చక్కెరలను నిర్వీర్యం చేస్తాయి. జీర్ణశక్తి పెరిగేందుకు, పోషకాలు సరిగ్గా వంటికి పట్టేందుకు పులియబెట్టిన పదార్థాలు సాయపడతాయి. 
  • అధిక శాతం పులిసిన ఆహారాల్లోని బ్యాక్టీరియాలో ప్రొబయాటిక్ గుణాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియానే జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టలో మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. 
  • మనం తీసుకున్న ఆహారంలోని గంజి, చక్కెరలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో ఆ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
  • ఫెర్మెంటేషన్ వల్ల కొన్ని రకాల పోషకాలు మరింత అనుకూలంగా మారతాయి. అంటే వాటిని మన శరీరం సులభంగా గ్రహించగలదు. ఫైటిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది.
  • కొన్ని రకాల పులియబెట్టిన పదార్థాలు కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. 
  • యుగర్ట్, చీజ్, పచ్చళ్లు ఫెర్మెంట్ ఫుడ్స్ కిందకే వస్తాయి. వీటిని తీసుకోవచ్చు.


More Telugu News