డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ!.. కారణం అదేనా?
- బెంగళూరులో డీకేతో కోమటిరెడ్డి సమావేశం.. చేరికలపై చర్చ
- తన సోదరుడు రాజపాల్ రెడ్డి చేరికపైనా చర్చించినట్లు ప్రచారం
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా మారుతున్న డీకే
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో జోష్ ని పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్.. తెలంగాణ పాలిటిక్స్ విషయంలోనూ తన ‘ట్రబుల్ షూటర్’ పాత్ర పోషిస్తున్నారు. షర్మిల పలుమార్లు ఆయనతో భేటీ కావడం.. కాంగ్రెస్ లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో చక్రం తిప్పడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కర్ణాటకకు వెళ్లి, డీకేతో భేటీ అయ్యారు. బెంగళూరులో సమావేశమైన వీరిద్దరూ.. చేరికలపై ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరే అంశంపై కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి వచ్చే వారి పేర్లు చెప్పనని, అందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని గురువారం వెంకట్ రెడ్డి చెప్పడం గమనార్హం.