ధోనీ పెట్టుబడులతో దిగ్గజ కంపెనీగా ఎదిగిన సంస్థ

  • డ్రోన్ల రంగంలో ప్రముఖ కంపెనీగా ఎదిగిన గరుడ ఏరోస్పేస్
  • 2022లో ఈ కంపెనీలో ధోనీ పెట్టుబడులు.. అనంతరం ప్రచారం
  • ఏటా ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు
మహేంద్రసింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) లక్కు ఎంత బలమైనదో మనం క్రికెట్లో ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాం. ధోనీ అదృష్టం క్రికెట్ కే పరిమితం కాలేదు. వ్యాపారాల్లోనూ అతడు దినదిన ప్రవర్థమానం చెందుతున్నాడు. పట్టిందల్లా బంగారమే అన్న చందంగా అతడు పెట్టుబడి పెడితే చాలు.. ఆ కంపెనీలకూ అదృష్టం అంటుకుంటోంది. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సంస్థ ‘గరుడ ఏరోస్పేస్’లో ధోనీకి వాటాలున్నాయి. 

ఈ గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన అగ్నీశ్వర్ జైప్రకాష్ ఎంఎస్ ధోనీకి అతిపెద్ద వ్యాపార భాగస్వామి కావడం గమనించాలి. స్వతహాగా అగ్నీశ్వర్ అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్. 2022లో గరుడ ఏరోస్పేస్ లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 400 డ్రోన్లు ఉన్నాయి. స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్, డెల్హివరీ (గోదాముల కోసం) కోసం గరుడ ఏరోస్పేస్ సేవలు అందిస్తోంది. గతేడాది ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ధోనీ ఈ కంపెనీకి బ్రాండ్ ప్రచారకర్త బాధ్యతలు సైం తీసుకున్నాడు. ధోనీ ఏటా ఎన్నో కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం గమనించొచ్చు.


More Telugu News