బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదు: కిషన్ రెడ్డి

  • బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శ
  • సీఎం కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపణ
  • రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్న కేంద్ర మంత్రి
రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఇప్పటి వరకూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. వందలాది మంది బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం పాలైందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకుందని ఆరోపించారు. ఆ డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని అనుకుంటోందని విమర్శించారు. 

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అవినీతిమయం అయిందన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్లు మళ్లీ బీఆర్‌ఎస్ లో చేరుతారన్నారు. బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News