బైజూస్‌కు షాక్, ముగ్గురు బోర్డు సభ్యుల మూకుమ్మడి రాజీనామా!
- బైజూస్ రవీంద్రన్ తో కొనసాగుతున్న విభేదాల కారణంగా రాజీనామా
- రాజీనామాకు కంపెనీ ఆమోదం తెలపలేదని సమాచారం
- రాజీనామా చేసినవారు లేదా కంపెనీ స్పందించాల్సి ఉంది
ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ బోర్డుకు ఒకేసారి ముగ్గురు కీలక సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పీక్ ఎక్స్వీ పార్ట్‌నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్, చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ కు చెందిన వివియన్ వూ, ప్రోసెస్ కంపెనీకి చెందిన రస్సెల్ డ్రెయిన్ స్టాక్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. కంపెనీని నిర్వహించే విషయంలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తో ఏడాదిగా కొనసాగుతున్న విభేదాల వల్లే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
వీరి రాజీనామాకు కంపెనీ ఇంకా ఆమోదం తెలపలేదని సమాచారం. ఈ అంశంపై బైజూస్ గానీ రాజీనామా చేసిన వారు గానీ స్పందించాల్సి ఉంది. ఓ వైపు కోర్టు కేసులు, మరోవైపు రుణ ఎగవేతలు, ఇంకోవైపు ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రకటించడంలో జాప్యం వంటి అంశాలతో బైజూస్ చిక్కులు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ఉద్యోగులను కూడా తొలగించింది. ఈ క్రమంలో ముగ్గురు సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు.