చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు

  • గత కొన్నిరోజులుగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు
  • పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
  • ఇవాళ చెన్నై, వేలూరు జిల్లాలో భారీ వర్షపాతం
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడులో చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే అక్కడ పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో, నేడు కూడా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. 

ముఖ్యంగా చెన్నైలో భారీ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలో చాలాప్రాంతాల్లో రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాదాపు గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. 

కాగా, నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తాజా అప్ డేట్ వెలువరించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, ముంబయి మహానగరంపై నైరుతి రుతుపవనాల ప్రభావం వచ్చే వారం ఉండొచ్చని అంచనా వేసింది.


More Telugu News