ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ తో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 284 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 85 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించినప్పటికీ... వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో నిన్నటి లాభాలను కోల్పోయి చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 63,238కి పడిపోయింది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 18,771కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (0.95%), టాటా స్టీల్ (0.73%), హెచ్డీఎఫ్సీ (0.62%), భారతి ఎయిర్ టెల్ (0.55%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.48%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.35%), టాటా మోటార్స్ (-2.05%), ఏసియన్ పెయింట్స్ (-1.98%), పవర్ గ్రిడ్ (-1.72%), ఎన్టీపీసీ (-1.47%).


More Telugu News