ఆస్ట్రేలియా క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!: ఇంగ్లాండ్ పేసర్‌కు పాంటింగ్ కౌంటర్
- యాషెస్ తొలి టెస్ట్ చివరి రోజున ఉస్మాన్ ను ఉద్దేశించి ఇంగ్లాండ్ పేసర్ స్లెడ్జింగ్
- ఆస్ట్రేలియా ఆటగాళ్లు గతంలో ఇలాగే స్లెడ్జింగ్ చేశారన్న రాబిన్సన్
- రాబిన్సన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన పాంటింగ్
యాషెస్ తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్ చివరి రోజు ఆసిస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఉద్దేశించి ఇంగ్లాండ్ పేసర్ స్లెడ్జింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరో పేసర్ జేమ్స్ అండర్సన్ అతనిని పక్కకు తీసుకు వెళ్లవలసి వచ్చింది. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం రాబిన్సన్ మాట్లాడుతూ... గతంలో తమ జట్టుపై రికీ పాంటింగ్ సహా ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలాగే స్లెడ్జింగ్ కు పాల్పడ్డారన్నాడు.
తాజాగా రాబిన్సన్ వ్యాఖ్యలపై పాంటింగ్ దీటుగా స్పందించాడు. రాబిన్సన్ వ్యాఖ్యలు సరైనవి కావని, అనవసరంగా తన పేరును లాగారని పాంటింగ్ అన్నాడు. అతను మాట్లాడిన తీరు సరికాదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, ఆసీస్ తో ఇలాంటి ఇంగ్లాండ్ జట్టు ఆడలేదన్నారు. నాణ్యమైన ఆసీస్ జట్టుతో యాషెస్ క్రికెట్ అంటే ఏంటో వేగంగా అర్థం చేసుకోవాలన్నాడు. గతవారమే రాబిన్సన్ నేర్చుకోలేకపోయాడని, అతడు కాస్త నెమ్మదిగా నేర్చుకుంటాడని భావిస్తున్నట్లు చెప్పాడు. యాషెస్ లో ఆసిస్ క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే ముందుగా రాబిన్సన్ బౌలింగ్ ప్రదర్శన మెరుగ్గా ఉండేలా చూసుకోవాలన్నాడు.
మ్యాచ్ తర్వాత ఏదో చెప్పాలనుకొని తన పేరును ప్రస్తావించాడన్నాడు. అలా చేయకుండా ఉంటే బాగుండేదన్నాడు. ఆయన వ్యాఖ్యలతో తనకు పోయేదేమీ లేదని, ఒకవేళ అతను తన గురించి ఆలోచించాలనుకుంటే పదిహేనేళ్ల క్రితం వరకు నేనేం చేశానో తెలుసుకోవాలన్నాడు. ఆసీస్ క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే మాత్రం బౌలింగ్ మెరుగుపరుచుకోవాలన్నాడు.