'అంతం' సినిమా ఫ్లాప్ .. అయినా అది నాకు మంచే చేసింది: రామ్ గోపాల్ వర్మ

  • 'అంతం' వలన ఊర్మిళ పరిచయమైందన్న వర్మ 
  • ఆ పరిచయం వల్లనే 'రంగీలా' వచ్చిందని వెల్లడి 
  • 'అంతం' కథనే కాస్త మార్చి 'సత్య;గా తీశానని వివరణ
  • ఆ రెండు సినిమాలు తనని నిలబెట్టాయని వ్యాఖ్య
రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఇప్పుడు తన స్పీడ్ పెంచడానికి రెడీ అవుతున్నారు. వరుస ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో, రీసెంట్ గా కొత్త ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు.  

"నా లైఫ్ లో నేను చేసిన చెత్త సినిమా ఏదైనా ఉందంటే అది 'అంతం' సినిమానే. ఆ సినిమా లైన్ ను నేను ఒక బుక్ లో నుంచి తీసుకున్నాను. సినిమా పూర్తయిన తరువాత చూస్తే, బుక్ లో ఉన్న మెటీరియల్ ను నేను సరిగ్గా గ్రహించలేకపోయానని అనిపించింది. బుక్ లో ఉన్న మెటీరియల్ తో పోల్చుకుంటే, ఆ లైన్ ను నేను చెడగొట్టాననే అనిపించింది" అన్నారు.  

"అయితే 'అంతం' సరిగ్గా ఆడకపోయినా, బాలీవుడ్ లో నేను నిలదొక్కుకోవడానికి అదే కారణం. ఆ సినిమా వల్లనే నాకు ఊర్మిళ తెలిసింది. ఆ పరిచయంతోనే 'రంగీలా' చేశాను. ఇక 'అంతం' కథనే అటూ ఇటూ తిప్పి 'సత్య' సినిమాను తీశాను. 'రంగీలా' .. 'సత్య' ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నేను బాలీవుడ్ లో స్టాండ్ అవ్వడానికి ఆ రెండు సినిమాలు కారణమే" అంటూ చెప్పుకొచ్చారు. 


More Telugu News