400 కోట్ల మార్క్ ను టచ్ చేసిన 'ఆదిపురుష్'
- మొదటిరోజున 140 కోట్లు రాబట్టిన 'ఆదిపురుష్'
- మిగతా ఐదు రోజుల్లో 270 కోట్ల గ్రాస్
- మొత్తం 6 రోజుల వసూళ్లు 410 కోట్లు
- ఈ వారాంతానికి 500 కోట్లు వసూలు చేసే ఛాన్స్
'ఆదిపురుష్' విడుదలైన దగ్గర నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేయలేదు. ఈ సినిమా మొదటి మూడు రోజులు భారీ వసూళ్లను రాబట్టింది. నాలుగో రోజు నుంచి వసూళ్ల గ్రాఫ్ తగ్గుతూ వెళ్లడం మొదలైంది. నాలుగో రోజుతో 375 కోట్లు .. ఐదో రోజుతో 395 కోట్లను వసూలు చేసింది.
ఇక ఆరో రోజుతో ఈ సినిమా 410 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అంతకు ముందు రోజుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబట్టిన మొత్తం 15 కోట్లు మాత్రమే. ఇతర భాషల్లోను క్రితం వారం చెప్పుకోదగిన సినిమాలను వదల్లేదు. ఈ వారంలో మాత్రం కొన్ని సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. తెలుగు వైపు నుంచి చూస్తే మాత్రం పోటీ లేదనే చెప్పాలి. ఈ సినిమాలో ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై దర్శకుడు దృష్టిపెట్టలేదు. అందుకు సంబంధించిన సన్నివేశాలను ట్రిమ్ చేస్తూ వెళ్లి, ఆ సమయాన్ని మొత్తం యుద్ధం నేపథ్యంలోని సీన్స్ కి వాడేశాడు. ఆ సన్నివేశాలు కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉండటమనేది ప్రధానమైన లోపంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఆరో రోజుతో ఈ సినిమా 410 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అంతకు ముందు రోజుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబట్టిన మొత్తం 15 కోట్లు మాత్రమే. ఇతర భాషల్లోను క్రితం వారం చెప్పుకోదగిన సినిమాలను వదల్లేదు. ఈ వారంలో మాత్రం కొన్ని సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. తెలుగు వైపు నుంచి చూస్తే మాత్రం పోటీ లేదనే చెప్పాలి.