విరిగిన రైలు పట్టా.. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
- ఏపీ బాపట్ల జిల్లాలోని ఈపురుపాలెం వంతెన వద్ద ఘటన
- పట్టా విరిగిన సమాచారం ఇచ్చి ప్రమాదం తప్పించిన ఓ చేనేత కార్మికుడు
- సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసి పట్టాను సరిచేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయం గుర్తించిన గద్దె బాబు అనే చేనేత కార్మికుడు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో అదే ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగుళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. దీంతో పెను ముప్పు తప్పింది.
ఈ విషయం తెలిసి రైలులోని ప్రయాణికులు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరిగిన రైలు పట్టాను సరిచేసిన తర్వాత సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలు బెంగుళూరు బయలుదేరి వెళ్లనుంది. పట్టా సరిచేసే వరకూ దాదాపు ఐదు రైళ్లను నిలిపి వేశారు. విరిగిన రైలు పట్టా గురించి తెలిపిన చేనేత కార్మికుడిని రైల్వే అధికారులు అభినందించారు.