చైనా రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్.. 31 మంది సజీవ దహనం
- చైనాలోని యించువాన్‌లో ఘటన
- పండుగ వేళ విషాదం నింపిన ప్రమాదం
- గ్యాస్ లీకై భారీ పేలుడు
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ లీకై సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 31 మంది మృతి చెందారు. ప్రజలందరూ డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను ఆనందంగా జరుపుకుంటున్న వేళ జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో పిల్లాపెద్దా అందరూ కలిసి ఆనందోత్సాహల మధ్య పండుగ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో గత రాత్రి 8 గంటల వేళ ఎల్పీజీ గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఆ వెంటనే రెస్టారెంట్‌ను మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో 31 మంది సజీవ దహనం కాగా, మరెంతోమంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి.