అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులకు మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే.. స్పెషల్ అట్రాక్షన్ గా డైమండ్!
- వైట్ హౌస్ లో మోదీకి బైడెన్ దంపతుల ఆత్మీయ స్వాగతం
- వినాయకుడి విగ్రహం, వెండి దీపం వంటి బహుమతులు ఇచ్చిన మోదీ
- యూఎస్ ప్రథమ మహిళకు గ్రీన్ డైమండ్ బహూకరించిన ప్రధాని
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్ కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు బైడెన్ దంపతులు ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. మరోవైపు బైడెన్ దంపతులకు మోదీ పలు బహుమతులను ఇచ్చారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రత్యేకంగా చేయించిన గంధపు పెట్టెను ఇచ్చారు. కర్ణాటకలోని మైసూర్ నుంచి సేకరించిన గంధపు చెక్కతో దీన్ని తయారు చేశారు. ఈ గంధపు పెట్టెకు కళాత్మకంగా, అద్భుతమైన నగిషీలను చెక్కారు. ఈ పెట్టె లోపల వినాయకుడి విగ్రహం, వెండి దీపం ఉన్నాయి. ఒక శ్లోకం రాసిన తామ్ర ఫలకం కూడా ఉంది.
పశ్చిమ బెంగాల్ లోని కళాకారులు చేతితో తయారు చేసిన వెండి కొబ్బరికాయను కూడా మోదీ బహుమతిగా ఇచ్చారు. దీంతో పాటు రాజస్థాన్ లో తయారు చేసిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేన్ని ఇచ్చారు. వీటితో పాటు బైడెన్ భార్య, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు ల్యాబ్ లో తయారు చేసిన 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్ ను బహుమతిగా ఇచ్చారు.