జగన్ ప్రభుత్వం ఐపీ పెట్టేసింది: నారా లోకేశ్

  • వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్ములేపిన ‘యువగళం’
  • చేనేత కార్మికుల సమస్యలను విన్న నారా లోకేశ్
  • టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని భరోసా 
  • క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ
యువ నేత నారాలోకేశ్ యువగళం పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు డక్కిలి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మాపూరు, నాగవోలు, మిట్టపాలెం మీదుగా వెంకటగిరి శివారు కమ్మపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. లింగసముద్రంలో లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ స్థానికుల సమస్యలను సావధానంగా ఆలకించారు. చేనేత కార్మికుల సమస్యలపై చర్చించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతానని స్థానికులకు హామీ ఇచ్చారు. 

వెంకటగిరి చేనేతలను ఆదుకుంటాం..
వెంకటగిరి చేనేత కార్మికులను ఆదుకొనే బాధ్యత తనదని నారా లోకేశ్ అన్నారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఆదుకుంటాను. నూతన డిజైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు కూడా చేనేత కార్మికులకు అందడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యార్న్, కలర్, పట్టు సబ్సిడీలు తిరిగి అందిస్తాం. పట్టు రైతులను ఆదుకుంటాం. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు అందజేస్తాం.చేనేతపై జీఎస్టీ భారం పడకుండా చూస్తాం. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం’’ అని ఆయన చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు. 


జగన్ ప్రభుత్వం ఐపీ పెట్టేసింది..
జగన్ ప్రభుత్వం ఐపీ పెట్టేసిందని, అప్పుల్లో కూరుకుపోయిందని నారా లోకేశ్ విమర్శించారు. ‘‘ జగన్ పాలనలో సామాన్యులు బ్రతకడం కష్టంగా మారింది. అందుకే చంద్రబాబు గారు భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ‘తల్లికి వందనం’ పేరుతో రూ.15 వేలు ఇస్తాం. ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45 వేలు ఇస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు. 


ఇంకా లోకేశ్ ఎమన్నారంటే.. 
  • వెంకటగిరిలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేస్తాం! చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాం
  • చేనేత వస్త్రాలపై జిఎస్టీ భారం పడుకుండా చూస్తాం హ్యండ్లూమ్ వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తాం
  • నేస్తం అంటూ జగన్ మోసం చేసాడు. సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం అంటూ కండిషన్స్ పెట్టాడు. జగన్ పాలనలో ఆప్కో ని భ్రష్టు పట్టించాడు.
  • మైనారిటీ కార్పొరేషన్ నుంచి రెండుగా విభజించి, క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటుచేయడం ద్వారా క్రైస్తవ సోదరులకు న్యాయం చేస్తాం.
  • ఏపీపీఎస్సీ ని యూపీఎస్సీలా బలోపేతం చేసి, క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తాం, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం
  • చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యాక 20లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 
  • కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన 2లక్షల ఇందిరమ్మ ఇళ్లకు మేం అదనంగా ఆర్థిక సాయం అందించి పూర్తిచేశాం. పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సైకో ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. 

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1720.5 కి.మీ 
ఈరోజు నడిచిన దూరం 16.8 కి.మీ 

134వ రోజు పాదయాత్ర వివరాలు (22-6-2023):
వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):
సాయంత్రం 
4.00 – వెంకటగిరి శివారు కమ్మపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 – కమ్మపాలెంలో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
4.30 – వెల్లంపాలెంలో పద్మశాలి సామాజికవర్గీయులతో సమావేశం.
4.45 – పోలేరమ్మ గుడివద్ద స్థానికులతో సమావేశం.
5.00 – పాతబస్టాండులో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.30 – త్రిభువన్ సెంటర్ లో స్థానికులతో సమావేశం.
6.35 – ఆర్టీసి బస్టాండ్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.55 – వెంకటగిరి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
7.15 – పాలకేంద్రం వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.
7.35 – రాపూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
7.45 – నిడిగల్లు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
7.50 – బంగారుపేటలో స్థానికులతో సమావేశం.
8.10 – జంగాలపల్లిలో స్థానికులతో మాటామంతీ.
8.55 – సిద్ధగుంటలో స్థానికులతో సమావేశం.
9.40 – నిడిగల్లులో స్థానికులతో సమావేశం.
10.25 – నిడిగల్లు శివారు విడిది కేంద్రంలో బస.




More Telugu News