యోగాకు కాపీరైట్, పేటెంట్స్‌పై ఐక్యరాజ్య సమితిలో మోదీ ఏమన్నారంటే?

  • ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్
  • ముఖ్య అతిథిగా హాజరైన నరేంద్ర మోదీ
  • యోగా భారత్ లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని వెల్లడి
యోగా అనేది ఏ ఒక్క దేశానికి, మతానికి లేదా జాతికి చెందినది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొమ్మిదో వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా సెషన్ కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యోగాకు కాపీరైట్, పేటెంట్, రాయల్టీల వంటివి లేవన్నారు. యోగా భారత్ లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమన్నారు. యోగా అంటే ఐకమత్యం, అందుకే అందరూ కలిసి వచ్చారని మోదీ అన్నారు.

యోగా డే జరపాలనే ప్రతిపాదనకు అన్ని దేశాలు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. యోగా అంటేనే అందరినీ కలిపేదన్నారు. యోగా పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. 2023ను మిల్లెట్‌ ఇయర్‌గా ప్రకటించాలని భారత్‌ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందన్నారు. 

ఐక్య రాజ్య సమితిలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఐరాస ప్రముఖులతో పాటు 180కి పైగా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు, ఎంటర్‌ప్రెన్యూవర్స్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వార్షిక వేడుకగా గుర్తించాలని మోదీ ప్రతిపాదించారు.


More Telugu News