ఇంట్రెస్టింగ్ లైన్ తో వస్తున్న హారర్ థ్రిల్లర్ .. 'అశ్విన్స్'
- విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన 'అశ్విన్స్'
- హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఒక ఆత్మ కోసం యూట్యూబర్స్ సాగించే అన్వేషణ
- ఈ నెల 23వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
తెలుగు తెరపైకి గతంలో చాలానే హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో అసలు సిసలైన కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు హిట్ ఇచ్చారు. అలాంటి ఒక కంటెంట్ తో తెలుగు .. తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ సినిమానే 'అశ్విన్స్'. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కి తరుణ్ తేజ దర్శకత్వం వహించాడు.
ఈ నెల 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. లైన్ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది మరి. ఓ అయిదుగురు యూట్యూబర్స్ కలిసి లండన్ వెళతారు. అక్కడ ఒక దీవిలోని భవంతిలో చాలా కాలంగా ఒక దెయ్యం ఉంటుందని తెలుసుకుంటారు. ఆ భవంతిలోకి వెళ్లినవారు తిరిగి రాలేదని వింటారు. అయినా వాళ్లంతా ఆ భవంతిలోకి అడుగుపెట్టే సాహసం చేస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ.
ఫస్టాఫ్ లో కథ దార్లో పడుతూ వెళుతుందనీ, సెకండాఫ్ నుంచి అసలు హారర్ తెరపైకి వస్తుందని అంటున్నారు. విమలా రామన్ .. వసంత్ రవి .. మురళీధరన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, విజయ్ సిద్ధార్థ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.