ఆప్గనిస్థాన్ క్రికెటర్‌కు మహేంద్ర సింగ్ ధోనీ కానుక, గుర్భాజ్ ఆనందం
- సంతకం చేసిన సీఎస్కే జెర్సీని కానుకగా ఇచ్చిన ధోనీ
- ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆప్గనిస్థాన్ క్రికెటర్
- ధోనీకి థ్యాంక్స్ చెప్పిన రహమతుల్లా గుర్భాజ్
స్టార్ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఆప్గనిస్థాన్ క్రికెటర్ రహమానుల్లా గుర్భాజ్ కు మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు. తాను సంతకం చేసిన సీఎస్కే జెర్సీని కానుకగా ఇచ్చాడు ధోనీ. ఇందుకు సంబంధించిన ఫోటోను గుర్భాజ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ధోనీకి థ్యాంక్స్ చెప్పాడు.
ధోనీ అంతర్జాతీయంగా రిటైర్మెంట్ తీసుకున్న మూడేళ్ల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వికెట్ కీపర్లకు ఆదర్శంగా నిలిచాడు. ఐపీఎల్ లో 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి ఐదవ టైటిల్ ను గెలుచుకున్న రికార్డ్ సాధించింది. ధోనీ ఎంతోమంది వికెట్ కీపర్లకు ఆదర్శంగా నిలిచాడు.
ఆప్గనిస్తాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా ధోనీని ఎంతో అభిమానిస్తాడు. తన అభిమాన క్రికెటర్ ధోనీ నుండి తనకు కానుక రావడంపై గుర్భాజ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు చెప్పాడు. "భారత్ నుండి బహుమతిని పంపినందుకు ధన్యవాదాలు @mahi7781 సార్' అని గుర్బాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫోటోలను పంచుకున్నాడు. IPL 2023లో గుర్బాజ్ 11 మ్యాచ్‌లలో 227 పరుగులతో 133.52 స్ట్రైక్ రేట్‌తో నిలిచాడు. ఈ సీజన్ లో కేకేఆర్ ప్లేఆఫ్స్ దశకు చేరుకోలేకపోయింది.