ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్, ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

  • ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చిన డెహ్రాడూన్ విమానం
  • ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన ఇండిగో
  • మెయింటెనెన్స్ ప్రక్రియ చేపడతామని వెల్లడి
సాంకేతిక సమస్య కారణంగా ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో తెలిపింది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

'ఢిల్లీ టు డెహ్రాడూన్ ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి వచ్చింది. పైలట్ విమానంలో సమస్యను గుర్తించి మాకు సమాచారం అందించాడు. అలాగే అత్యవసర ల్యాండింగ్ కావాలని కోరాడు. ఆ తర్వాత విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అవసరమైన నిర్వహణ తర్వాత తిరిగి ఆపరేషన్‌లో ఉంటుంది' అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా, విమానంలో మంటలు చెలరేగినట్లు వచ్చిన వార్తలను ఎయిర్‌లైన్స్ తోసిపుచ్చింది. సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

పాత విమానాలకు నో

2030-2035 మధ్య 500 కొత్త విమానాలను ఇండిగో కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎయిర్‌బస్‌తో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీంతో ఇండిగో చాలా వరకు పాత విమానాలను విరమించుకోవాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.


More Telugu News