ఇండియాలోని టాప్ 10 కంపెనీలు ఏమిటో, వాటి విలువ ఎంతో తెలుసా?
- టాప్ 500 ప్రైవేట్ కంపెనీల జాబితాను విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్, హురూన్ ఇండియా
- రూ. 17 లక్షల కోట్లకు పైగా విలువతో రిలయన్స్ టాప్
- రెండు, మూడు స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
మన దేశంలోని అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను యాక్సిస్ బ్యాంక్, హురూన్ ఇండియాలు విడుదల చేశాయి. 2022 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు. అయితే ఈ జాబితాలో కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలకు చోటు కల్పించలేదు.
దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీలు:
- రిలయన్స్ ఇండస్ట్రీస్ - విలువ రూ. 17,25,058 కోట్లు
- టీసీఎస్ - రూ. 11,68,390 కోట్లు
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - రూ. 8,33,656 కోట్లు
- ఇన్ఫోసిస్ - రూ. 6,46,985 కోట్లు
- ఐసీఐసీఐ బ్యాంక్ - 6,33,171 కోట్లు
- భారతి ఎయిర్ టెల్ - రూ. 4,89,575 కోట్లు
- హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ - రూ. 4,48,844 కోట్లు
- ఐటీసీ - రూ. 4,32,359 కోట్లు
- అదానీ గ్యాస్ - రూ. 3,96,245 కోట్లు
- అదానీ ఎంటర్ ప్రైజెస్ - రూ. 3,81,610 కోట్లు.