తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ఐదు రోజుల వసూళ్లు!
- ఈ నెల 16న విడుదలైన 'ఆదిపురుష్'
- తెలుగు రాష్ట్రాల్లోను భారీ వసూళ్లు
- 5 రోజుల్లో 115 కోట్లకి పైగా గ్రాస్, 75 కోట్లకి పైగా షేర్
- ఈ వారంలోను 'ఆదిపురుష్'కి లేని పోటీ
ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్లో రూపొందిన 'ఆదిపురుష్' ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 140 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాలుగో రోజున 375 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నిన్నటితో ఈ సినిమా 5 రోజులను పూర్తిచేసుకుంది. 5 రోజుల్లో ఈ సినిమా 75.7 కోట్ల షేర్ ను .. 115 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ షేర్ చూసుకుంటే 95 కోట్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు.
తెలుగు .. హిందీతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఒక వైపున ఈ సినిమాలో దర్శకుడు చేసిన మార్పుల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతూనే ఉంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం 'ఆదిపురుష్' కి కలిసొచ్చే అంశం.