శునకాలకూ యోగా తెలుసు.. ఫన్నీ వీడియో

  • ఐటీబీపీ సిబ్బంది యోగసనాలు
  • వారితో కలసి పాల్గొన్న ఓ శునకం
  • అది కూడా మధ్య మధ్యలో ఆసనాల ప్రదర్శన
యోగా ఆరోగ్యానికి మంచి మార్గమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ ఆవిష్కరణ అయిన యోగాకి నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయి. నేడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) యావత్ దేశం ఘనంగా జరుపుకుంటోంది. ప్రపంచ దేశాల్లోనూ ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది యోగాసనాలు వేశారు. జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ ప్రాణు క్యాంప్ లో ఇది చోటు చేసుకుంది.

అయితే, ఐటీబీపీ క్యాంప్ లో సిబ్బంది యోగసనాలు చేస్తుండగా, ఐటీబీపీకే చెందిన ఓ శునకం కూడా పాల్గొంది. పెద్దగా అరుస్తూ మధ్య మధ్యలో ఆసనాలు వేస్తూ అక్కడ సందడి చేసింది. దీని హడావుడి చూస్తుంటే ‘నేను కూడా చేస్తున్నాను చూశారా?’ అన్నట్టుగా ఉంది. ఐటీబీపీ డాగ్ స్క్వాడ్ లో ఇది కూడా ఒకటి. ‘‘బద్ధకస్తులైన మీ మానవులకే యోగా అవసరం కానీ, మా లాంటి జీవులకు కాదు’’ అంటూ ట్విట్టర్ యూజర్ ఒకరు కామెంట్ పెట్టడం గమనార్హం.


More Telugu News