మోదీ సర్కారుపై జాక్ డోర్సే ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందన ఇదే

  • ఏ దేశంలో అయినా చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనన్న మస్క్
  • అది తప్ప మరో ఆప్షన్ లేదని స్పష్టీకరణ
  • ఆదేశాలను శిరసావహించకపోతే మూసివేసుకోవాల్సిందేన్న అభిప్రాయం
భారత్ లో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో, కంటెంట్ విషయంలో తమకు ప్రభుత్వం నుంచి అభ్యర్థనలు వచ్చాయని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేయడం గుర్తుండే ఉంటుంది. తాము చెప్పినట్టు నడుచుకోకపోతే ట్విట్టర్ ను నిలిపివేస్తామని బెదిరింపులు సైతం వచ్చాయని ఆయన ఆరోపణలు చేశారు. వీటిని కేంద్ర సర్కారు తోసిపుచ్చింది కూడా. జాక్ డోర్సే ఆరోపణలపై ట్విట్టర్ ప్రస్తుత యజమాని అయిన ఎలాన్ మస్క్ స్పందించారు.  

‘‘ట్విట్టర్ కు ఎలాంటి చాయిస్ ఉండదు. స్థానిక ప్రభుత్వాల ఆదేశాలను పాటించాల్సిందే. స్థానిక ప్రభుత్వాల ఆదేశాలను అమలు చేయకపోతే మూసివేసుకోవడం ఖాయం’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం మస్క్ మీడియాతో అన్నారు. ఏ దేశంలో అయినా చట్టాలను అనుసరించడమే తాము చేయగలిగిన ఉత్తమమైన పనిగా పేర్కొన్నారు. అంతకుమించి తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. భూ ప్రపంచం మొత్తంపై అమెరికాను రుద్దలేమన్నారు. 2021 రైతుల ఆందోళన సమయంలో సున్నితమైన కంటెంట్ ను బ్లాక్ చేయాలని తమకు భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు జాక్ డోర్సే పేర్కొనడం గమనార్హం.


More Telugu News