ముహూర్తం కుదిరింది.. 2న కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి
- 25న ఢిల్లీకి జూపల్లి, పొంగులేటి
- 26న అక్కడే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటన
- వారితోపాటు మరికొందరు నేతలు కూడా చేరిక
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల రెండో తేదీన ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 25న ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇద్దరు నేతలు రాహుల్‌తో సమావేశమవుతారు. తర్వాతి రోజు అక్కడే విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రణాళిక ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి నేడు పొంగులేటి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత జూపల్లిని కూడా కలుస్తారు.
పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదనే అభిప్రాయానికి వారు వచ్చినట్టు తెలిసింది. దీనికి తోడు రాష్ట్రం నుంచి బీజేపీలో చేరిన నేతలకు ప్రాధాన్యం లభించకపోవడంతో అంతిమంగా వారు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరితోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు కూడా చేరే అవకాశం ఉందని కూడా సమాచారం.