ఆన్ లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న విద్యార్థిని... చివరికి..!

  • నెల్లూరు జిల్లాలో విషాద ఘటన
  • నెల్లూరులో బీఫార్మసీ చదువుతున్న పోలు కవిత
  • కవిత స్వస్థలం దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామం
  • ఫీజు కట్టాలని కవితకు రూ.2.5 లక్షలు ఇచ్చిన తల్లిదండ్రులు
  • ఆన్ లైన్ గేమ్ లో పెట్టి డబ్బంతా పోగొట్టుకున్న కవిత
  • తల్లిదండ్రులు తిట్టారని పురుగుమందు తాగిన వైనం
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన పోలు కవిత బీఫార్మసీ విద్యార్థిని. 20 ఏళ్ల కవిత నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తోంది. అయితే, ఆన్ లైన్ గేమ్ లకు బాగా అలవాటుపడిన కవిత... కాలేజీ ఫీజు కట్టమని తల్లిదండ్రులు ఇచ్చిన రూ.2.50 లక్షలను గేమ్ లో పోగొట్టుకుంది. 

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా ఆన్ లైన్ గేమ్ వ్యసనంతో నాశనం చేశావంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తిట్టారన్న మనస్తాపంతో కవిత ఐదు రోజుల కిందట పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఎదిగివచ్చిన కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


More Telugu News