సచిన్, కోహ్లీని దాటేసి.. ఇన్నాళ్లకు అలా ఔటై అరుదైన రికార్డ్ సృష్టించిన జో రూట్!
- యాషెస్ సిరీస్ లో 46 పరుగుల వద్ద నాథన్ బౌలింగ్ లో జోరూట్ స్టంపౌట్
- టెస్ట్ కెరీర్ లో రూట్ తొలిసారి స్టంపౌట్
- కెరీర్ లో 11,168 పరుగులు సాధించాక స్టంపౌట్ అయిన ఇంగ్లాండ్ ప్లేయర్
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 46 పరుగులు చేసి, నాథన్ లైయన్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఇక్కడ ఆసక్తికరమైన అంశమేమంటే జోరూట్ తన టెస్ట్ కెరీర్ లో స్టంపౌట్ కావడం ఇదే తొలిసారి. మొదటిసారి ఇలా ఔటైన రూట్ రికార్డు అందుకున్నాడు. అలాగే, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ లను అధిగమించి, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసి స్టంపౌంట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
జోరూట్ ఇప్పటి వరకు 131 టెస్టులు ఆడి, 11,168 పరుగుల వద్ద తొలిసారి స్టంపౌట్ అయ్యాడు. జో రూట్ కంటే ముందు వెస్టిండీస్ మాజీ ఆటగాడు శివనారాయణ్ చందర్ పాల్ ఈ జాబితాలో 11,414 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. 8800 పరుగుల వద్ద స్టంపౌట్ అయి గ్రేమ్ స్మిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత కోహ్లీ 8,195 పరుగుల వద్ద, సచిన్ 7,419 పరుగుల వద్ద వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. అయితే ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్ధనే ఉన్నారు. 149 టెస్టుల్లో 11,814 పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా స్టంపౌట్ కాలేదు.