ఆదిపురుష్‌పై ప్రభాస్‌కు మొదట్లోనే అనుమానం వచ్చిందట... వీడియో వైరల్!
- ఆదిపురుష్ ప్రారంభమైన నాలుగు రోజులకే తన పాత్రపై ప్రభాస్ లో అనుమానం
- భయం వద్దని ధైర్యం చెప్పిన దర్శకుడు ఓంరౌత్
- ప్రభాస్ ముందే చెప్పినా దర్శకుడి అతివిశ్వాసమని ఆగ్రహం
శ్రీరాముడిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. రామాయణాన్ని వక్రీకరించారంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కార్టూన్ సినిమాలా ఉందని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ తరానికి కావాల్సిన పద్ధతిలో ఈ సినిమాను తెరకెక్కించి, అందరూ దీనిని అనుసరించాలనే సదుద్దేశ్యంతో నిర్మించారని మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ చిత్రంపై కొన్ని విమర్శలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ కు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆదిపురుష్ సినిమా షూటింగ్ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తాను పోషిస్తున్న రాఘవుడి పాత్రపై అనుమానం వ్యక్తం చేసినట్లుగా ప్రభాస్ ఆ వీడియోలో పేర్కొన్నారు. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆ వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తూ, ఓంరౌత్ మేకింగ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
రాధేశ్యామ్ ప్రచారంలో భాగంగా అప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ.. నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఓంరౌత్ ని పిలిచి నేను ఈ సినిమాను చేయవచ్చునా? అని అడిగాను. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి పాత్రలను నేను చేయలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా సమస్య లేదు. కానీ ఆదిపురుష్ విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదు. అందుకే ఓంరౌత్ ని పిలిచి మరీ ఈ సినిమా నేను చేయవచ్చునా? అని అడిగా. దానికి ఓంరౌత్ స్పందిస్తూ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, నేను ఉన్నానని చెప్పాడని ఆ వీడియోలో ప్రభాస్ చెప్పినట్లుగా ఉంది. దీనిని ప్రభాస్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ముందే హెచ్చరించినా ఓంరౌత్ అతివిశ్వాసంతో ఈ సినిమాను చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.