నువ్ ఏడుస్తుంటే చూశాం... స్మిత్‌ను ఘోరంగా అవమానించిన ఇంగ్లాండ్ అభిమానులు

  • బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్
  • బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ఎగతాళి చేసిన ప్రత్యర్థి జట్టు ఫ్యాన్స్
  • స్మిత్ మొహంలో కనిపించిన బాధ
బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ ను ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేశారు. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్మిత్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీనిని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ గేలి చేశారు. 

బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు మీడియా ముందు స్మిత్ అంగీకరించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... టీవీలో నువ్వు ఏడుస్తుండటం మేం చూశామంటూ స్టేడియంలోని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అంతా పాట రూపంలో గట్టిగా నినాదాలు చేశారు. ప్రేక్షకులు తన గతాన్ని తవ్వి వెక్కిరించడంతో స్మిత్ చాలా ఇబ్బంది పడ్డాడు.

ప్రేక్షకులు గేలి చేస్తుండగా, స్మిత్ పైకి నవ్వుతూ ఇంకా అరవండి అని వ్యాఖ్యానించినప్పటికీ, అతని మొహంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తీరును చాలామంది తప్పుబడుతున్నారు.


More Telugu News