ఆ కోపంతోనే నాన్న ఇండస్ట్రీని వదిలేశారు: ఎ.ఎమ్.రాజా కూతురు హేమలత
- అప్పట్లో గాయనీ గాయకులుగా రాణించిన ఎ.ఎమ్.రాజా - జిక్కీ
- వారి ఆలాపనకి ఒక ప్రత్యేకత ఉండేదన్న కూతురు
- తన తండ్రికి ఆ డైరెక్టర్ తో గొడవ జరిగిందని వెల్లడి
- ఆనాటి స్టార్ హీరోల మాటను కూడా ఆయన వినలేదని వ్యాఖ్య
- కచేరీలు చేయడానికి కారణమదేనని వివరణ
తెలుగులో గాయనీ గాయకులుగా జిక్కీ .. ఎ.ఎం.రాజా స్థానం ప్రత్యేకం. అప్పట్లో వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గాయకుడిగాను ... సంగీత దర్శకుడిగాను సక్సెస్ అయినవారిలో ఎ.ఎం.రాజాను ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆనాటి విషయాలను వారి కూతురు హేమలత తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
"మా నాన్నగారి వాయిస్ చాలా స్వీట్ గా ఉండేది. ఆయనకి 'మెలోడీ కింగ్' అనే పేరు ఉండేది. ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ ఆయనతోనే ఎక్కువగా పాటలు పాడించుకునేవారు. అప్పట్లో ఆయన పాడినవి .. కంపోజ్ చేసినవి అన్నీ హిట్లే. ఇక అమ్మగారు బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత సింగింగ్ వైపుకు వచ్చారు. 'అనార్కలి' సినిమా ఆమెకి మంచిపేరు తెచ్చిపెట్టింది" అన్నారు.
"నాన్నకి అవకాశాలు తగ్గడం వల్లనే కచేరీలు చేయడం మొదలెట్టారని అనుకుంటారు. కానీ ఆయనకి అవకాశాలు తగ్గలేదు. అప్పట్లో డైరెక్టర్ శ్రీధర్ తో జరిగిన ఒక గొడవ కారణంగా ఆయన ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేశారు. ఆ తరువాత సినిమాల వైపు చూడకుండా కచేరీలు చేసుకున్నారు. ఈ విషయంలో ఆనాటి పెద్ద హీరోలంతా రిక్వెస్ట్ చేసినా మా ఫాదర్ వినిపించుకోలేదు" అని చెప్పుకొచ్చారు.