4వ రోజుతో 400 కోట్ల మార్క్ కి దగ్గరలో 'ఆదిపురుష్'
- ఈ నెల 16న వచ్చిన 'ఆదిపురుష్'
- మార్పుల పట్ల పెరుగుతున్న అసహనం
- వసూళ్లపై ప్రభావం చూపించని విమర్శలు
- ఈ రోజుతో 400 కోట్ల మార్కును టచ్ చేసే ఛాన్స్
'ఆదిపురుష్' మొదటి నుంచి కూడా అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. సీతారాములుగా తెరపై ప్రభాస్ - కృతి సనన్ ఎలా ఉంటారా అనేది అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వెళ్లింది. ఇక 3D వెర్షన్ లోను ఈ సినిమాను అందించనున్నట్టు చెప్పడం పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతూ వెళ్లింది.
విడుదలకి ముందే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి సిద్ధం చేసిన ఈ సినిమా, తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మూడు రోజుల్లో 340 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. నిన్న నాలుగో రోజుతో కలుపుకుంటే, ఈ సినిమా 375 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ రోజుతో ఈ సినిమా 400 కోట్ల మార్కును దాటేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రధానమైన పాత్రల లుక్స్ పరంగా .. చిత్రీకరణ పరంగా సంభాషణల పరంగా ఈ సినిమా విమర్శలను ఎదుర్కుంటోంది. శ్రీరాముడు - రావణుడు చేతులతో తలపడటం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఈ సినిమా విషయంలో అక్కడక్కడా అసహనాలు .. నిరసనలు వ్యక్తమవుతున్నా, అవి వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపకపోవడం విశేషం.