అజ్ఞాతంలో ఉన్న ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అరెస్ట్?
- ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపణలు
- ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సూర్యనారాయణ
- బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో అజ్ఞాతంలోకి
- రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై గత నెల 31న విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఏ5 నిందితుడిగా ఉన్నారు.
ముందస్తు బెయిలు కోసం విజయవాడ ఏడీజే కోర్టులో వేసిన పిటిషన్ ఈ నెల 15న తిరస్కరణకు గురైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విశాఖపట్టణం, విజయవాడ, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఆయన కోసం పోలీసులు గాలించారు.
చివరికి నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.