కదిలిన రుతుపవనాలు.. మరో 4 రోజుల్లో ఏపీ అంతటా విస్తరణ

  • బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటడంతో జోరందుకున్న రుతుపవనాలు
  • అరేబియాలో ఉపరితల అవర్తనంతో నైరుతి విస్తరణకు మరింత అనుకూలంగా వాతావరణం
  • ఇప్పటికే రాయలసీమ ప్రాంతం అంతటా విస్తరించిన నైరుతి, పలు ప్రాంతాల్లో వర్షాలు
  • రుతుపవనాల రాకతో తగ్గిన ఉష్ణోగ్రతలు, ప్రజలకు ఉపశమనం 
ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్! బిపోర్‌జాయ్ తుపాను కారణంగా స్తంభించిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల అవర్తనంతో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. 

పది రోజుల క్రితమే ‘నైరుతి’ రాయలసీమను తాకినా తుపాను కారణంగా అవి ముందుకు కదల్లేదు. శ్రీహరికోట ప్రాంతంలోనే స్తంభించిపోయాయి. తుపాను తీరం దాటడంతో ఆదివారం నుంచీ రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదలడం ప్రారంభించాయి. సోమవారం రాయలసీమ అంతటా విస్తరించాయి. దీంతో, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి, పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం లభించింది.


More Telugu News