పవన్, నీ మీద రష్యాలో ఫైల్ ఓపెన్ అయింది... ఎవరు ఆపినా ఆగదు: అంబటి
- పవన్ కల్యాణ్ విమర్శలకు అంబటి కౌంటర్
- పవన్ ఒక పిరికిపంద అని వెల్లడి
- ప్రాణహాని అంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శలు
- పవన్ మళ్లీ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల దాడిని మంత్రి అంబటి రాంబాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పవన్ ఒక పిరికిపంద అని, అందుకే ప్రాణహాని అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు చేశారు.
వారాహి అంటే అమ్మవారు అని, అమ్మవారిని వాహనంగా పెట్టుకుని, అమ్మవారి వాహనం ఎక్కి ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. రెండు చోట్ల ఓడిపోయావు... గుర్తుపెట్టుకో... మళ్లీ ఓడిపోతావు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
అంతేకాదు, వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు ఇక ఏ సినిమా హిట్ కాదని, ఇది అమ్మవారి శాపం అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాకినాడ వెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
"ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఏంచేస్తావ్ ఆయనను? ఆయనను రౌడీ, దుర్మార్గుడు అంటూ అవాకులు చెవాకులు పేలుతున్నావు. రూ.15 వేల కోట్లు దోచుకున్నాడని అంటున్నావు.
ఇంకొక మాట కూడా అన్నాడు.... ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు కానీ... అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతాడట. అబ్బబ్బబ్బ.... ఏం డైలాగయ్యా అది. ఓ ఎమ్మెల్యేని బట్టలూడదీసి కొడతావా? అయ్యే పనేనా అది... నీకంత దమ్ము, ధైర్యం ఉన్నాయా? ప్రజాస్వామ్యంలో ఇది జరిగే పనేనా?
నువ్వు ఇలాగే మాట్లాడితే చెప్పులే కాదు... బట్టలు కూడా పోగొట్టుకుంటావు. బనియన్, కట్ డ్రాయర్ తో వచ్చి... నా బట్టలు కూడా పోయాయని చెబుతావు. నీ బతుకు అలా తయారవుతుంది. వైసీపీ గూండాలను ఇళ్లలోంచి బయటికి లాగి కొడతాడంట. ఏం మాటలయ్యా ఇవి.
ఈయనకు ప్రాణహాని ఉందట... ఈయన ఇంటి వద్ద రెక్కీ కూడా చేశారట. అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? నీ వల్ల ఎవడికీ లాభం కానీ, నష్టం కానీ లేవు. నీ బతుకు నువు బతుకుతున్నావు... రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యావు. ఇవాళ బూతుల స్టార్ అవుతున్నావు. నిన్ను ఎవరైనా ఎలిమినేట్ ఎందుకు చేస్తారో అర్థంకాదు.
నేనిక ఎక్కడికీ వెళ్లను... ఇక్కడే అంటిపెట్టుకుని ఉంటాను అని పవన్ అంటున్నాడు. ఎందుకయ్యా కోతలు కోస్తావు... నీ చెప్పులు దొరికితే 23 తర్వాత వెళ్లిపోతావు... లేకపోతే చెప్పులు వెతుక్కోవడానికి మళ్లీ వస్తావు... అంతేకదా! అలాకాకుండా, ఇక సినిమాల జోలికి వెళ్లనంటూ చెప్పగలవా... చెప్పే దమ్ము నీకుందా? ఇది కూడా చెప్పలేవు. గెలిచేది లేదు చచ్చేది లేదు కానీ ఈయనను ఓడించడానికి రూ.200 కోట్లు ఖర్చు చేసి కుట్ర చేయాలా?
పవన్ కు నిజంగానే ప్రాణహాని ఉంటే అందుకు ఆధారాలు చూపించాలి. రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఓ ప్రభుత్వంగా మాకు ఉంటుంది. అలాకాకుండా ప్రాణహాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నాను. సానుభూతి కోసమే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. ఓవైపు ప్రాణహాని అంటాడు, మరోవైపు చేగువేరా స్ఫూర్తి అంటాడు... ఏమిటీ వైరుధ్యం అని ప్రశ్నిస్తున్నాను.
ద్వారంపూడి మీద ఢిల్లీలో ఫైల్ ఓపెన్ అయిందని పవన్ అంటున్నాడు. ద్వారంపూడి మీద ఢిల్లీలో ఫైల్ ఓపెన్ కావడం కాదు... నీ మీద రష్యాలో ఫైల్ ఓపెన్ అయింది. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఒకసారి యాక్షన్ మొదలుపెడితే మోదీ చెప్పినా వినదు.
చంద్రబాబును సీఎంను చేయడం కోసం పవన్ పార్టీ పెట్టాడని తెలియక యువత మోసపోతోంది. వారి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. పవన్ తన చెప్పులు పోయాయంటున్నాడు. నాకు తెలిసినంతవరకు ఒక చెప్పు బీజేపీ ఆఫీసులో, మరో చెప్పు టీడీపీ ఆఫీసులో ఉండొచ్చు" అంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.