భారత నిఘా విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా

  • రీసెర్చ్ అండన్ అనాలసిస్ వింగ్ (రా)కు కొత్త చీఫ్
  • ఏడేళ్లుగా రాలో ఆపరేషనల్ విభాగం హెడ్ గా సేవలు అందిస్తున్న రవి సిన్హా
  • నిఘా వ్యవహారాల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు
  • రవి సిన్హా నియామకానికి కేంద్ర మంత్రుల కమిటీ ఆమోద ముద్ర
భారత నిఘా విభాగం 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) కొత్త అధిపతిగా రవి సిన్హా నియమితులయ్యారు. చత్తీస్ గఢ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 

రవి సిన్హా గత ఏడు సంవత్సరాలుగా 'రా'లోనే ఆపరేషనల్ వింగ్ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విదేశాల్లో గూఢచర్యం, నిఘా వ్యవహారాల్లో రవి సిన్హా మంచి దిట్ట అని పేరుంది. 'రా' నూతన అధిపతిగా రవి సిన్హా నియామకంపై కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది. 

ఇప్పటివరకు 'రా' చీఫ్ గా వ్యవహరించిన సమంత్ కుమార్ గోయల్ త్వరలో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆయన పదవీకాలం పలుమార్లు పొడిగించారు. 

కాగా, భారత నిఘా విభాగంలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా రవి సిన్హాకు పేరుంది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివారన్న విషయం తప్ప, రవి సిన్హా వ్యక్తిగత విషయాలు చాలావరకు ఎవరికీ తెలియవు. నిఘా విభాగంలో పనిచేసే ఉద్యోగుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారన్న విషయం తెలిసిందే.


More Telugu News