జీవితకాల గరిష్ఠాల దిశగా పయనించి... చివరకు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 216 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 
  • 70 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు జీవనకాల గరిష్ఠాల దిశగా పయనించాయి. అయితే ఈ దశలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 216 పాయింట్లు నష్టపోయి 63,168కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 18,755 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.52%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.21%), టెక్ మహీంద్రా (1.34%), టీసీఎస్ (1.08%), సన్ ఫార్మా (1.04%). 

టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-1.83%), యాక్సిస్ బ్యాంక్ (-1.54%), ఎన్టీపీసీ (-1.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.28%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.24%).


More Telugu News