శవపేటికలో నుంచి లేచిన బామ్మ... ఆసుపత్రిలో చనిపోయింది!
- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు
- చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు
- శవపేటికలో ఉంచగా తట్టిన వృద్ధురాలు
- మరోసారి ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు.. చికిత్స పొందుతూ మృతి
చనిపోయిందనుకొని, సమాధి చేస్తున్న సమయంలో ఓ వృద్ధురాలు శవపేటికలో నుండి తట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన బంధువులు ఆమె బతికి ఉందని గ్రహించి, ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆ వృద్ధురాలు చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఈక్వెడార్ లో జరిగింది. ఇక్కడి బాబాహోయో నగరానికి చెందిన 76 ఏళ్ల బెల్లా మోంటయ అనే వృద్ధురాలికి ఇటీవల గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా అందించారు.
మృతదేహాన్ని తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు శవపేటికలో ఉంచి, అంత్యక్రియలకు సిద్ధం చేశారు. ఐదారు గంటలు గడిచాక శవపేటిక నుండి ఎవరో తడుతున్నట్లుగా శబ్దం వచ్చింది. కంగారుపడిన బంధువులు, తెరిచి చూసి, ఆమె బతికి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు, రెండోసారి ఆసుపత్రిలో చేరిన ఆ వృద్ధురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది.