‘అతిగా ఆలోచించే వ్యక్తి’ అనే ముద్రే నాకు నష్టం చేసింది: రవిచంద్రన్ అశ్విన్

  • ఆట పరంగా భరోసా కల్పించానన్న అశ్విన్
  • తాను అతిగా ఆలోచించే వాడిని కాదని స్పష్టీకరణ
  • ఒకరి గురించి అలా ప్రచారం చేసే హక్కు మరొకరికి లేదని వ్యాఖ్య
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్న తర్వాత బీసీసీఐ సెలక్టర్ల ముందుకు ఎన్నో పేర్లు వచ్చాయి. వారిలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ పేరు మాత్రం వినిపించలేదు. అతడికి కెప్టెన్ గా అనుభవం కూడా ఉంది. దీనికితోడు అశ్విన్ మంచి బౌలర్ గానే కాకుండా బ్యాటుతోనూ సత్తా చాటుతాడని తెలిసిందే. అయినా కెప్టెన్సీకి అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు.

 దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, ఓ వార్తా సంస్థతో మాట్లాడాడు. తనను అతిగా ఆలోచించే వ్యక్తిగా ముద్ర వేయడమే తనకు చేటు చేసినట్టు చెప్పాడు. ఇతర ఆటగాళ్ల మాదిరే తుది 11లో చోటు ఇస్తే స్థిరంగా రాణిస్తానని తాను భరోసా ఇచ్చినట్గు గుర్తు చేశాడు. తన పాత్ర గురించి తానేమీ అతిగా ఆలోచించడం లేదన్నాడు. ‘‘చాలా మంది నన్ను అతి ఆలోచనవాదిగా మార్కెట్ చేశారు. ఇది సరికాదు. ఎవరి ప్రయాణం వారిదే. మరొకరి గురించి అలా చెప్పే హక్కు ఇంకొకరికి లేదు. దీనిపై విచారించే సమయం నాకు లేదు’’ అని అశ్విన్ స్పష్టం చేశాడు.


More Telugu News