ఈ పదార్థాలను కుక్కర్ లో వండకూడదని తెలుసా?
- పాలు, పాల పదార్థాలకు అనుకూలం కాదు
- అన్నం వండే సమయంలో అక్రిలమైడ్ రసాయనం విడుదల
- దీనివల్ల ఆరోగ్య సమస్యలు
- బంగాళాదుంపలు, చేపలు, మాంసానికీ సరైనది కాదు
ప్రెషర్ కుక్కర్ ను చాలా మంది వినియోగిస్తుంటారు. కానీ, కుక్కర్ లో అన్నీ పెట్టేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. నీటి ఆవిరితో కూడిన వంటకే ప్రెషర్ కుక్కర్ వాడడం సముచితం. ఫ్రయింగ్ కు ప్రెషర్ కుక్కర్ సరైనది కాదు.
- ముఖ్యంగా ప్రెషర్ కుక్కర్ నూడుల్స్ కు అనుకూలం కాదు. నురుగు వచ్చే పదార్థం. ప్రెషర్ ను విడుదల చేసే వాల్వ్ మార్గానికి నూడుల్స్ అడ్డుపడతాయి.
- ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండుకోవడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అన్నం వండే సమయంలో గంజి కారణంగా అక్రిలమైడ్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది ఆరోగ్య సమస్యలను తెస్తుంది.
- బంగాళాదుంపలను కూడా ప్రెషర్ కుక్కర్ లో ఉడికించొద్దు. ఎందుకంటే ఇది కూడా గంజిని విడుదల చేసేదే.
- ప్రెషర్ కుక్కర్ లో చేపలను కూడా ఉడికించకూడదు. కొంచెం అధికంగా ఉడికినా రుచిపోతుంది.
- ప్రెషర్ కుక్కర్లో మాంసాన్ని ఉడికించినా గొప్ప రుచి రాదు.
- అలాగే సముద్ర ఉత్పత్తులైన ఓయెస్టర్స్, ష్రింప్ లను కూడా కుక్కర్ లో ఉడికించుకోవడం అనుకూలం కాదు. రుచి పాడైపోతుంది.
- డైరీ ఉత్పత్తులకు సైతం ప్రెషర్ కుక్కర్ అనుకూలం కాదు.