ఎల్లో జట్టులో భాగం కావాలనుకున్నాను: గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్

  • టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టులో స్థానం సంపాదించిన మిల్లర్
  • వచ్చే నెల నుంచి మేజర్ లీగ్ క్రికెట్ 
  • ఈ లీగ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందన్న దక్షిణాఫ్రికా క్రికెటర్
గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్.. టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టులో భాగమయ్యాడు. అమెరికాలో వచ్చే నెలలో మొదలయ్యే ‘మేజర్ లీగ్ క్రికెట్’ (ఎంఎల్ సీ 2023)లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. ఈ ఫ్రాంచైజీకి చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఉండడం గమనార్హం. డేవిడ్ మిల్లర్ దీనిపై తన స్పందన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సందేశాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ తన ట్వట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. 

‘‘సూపర్ కింగ్స్ కుటుంబంలో భాగం కావడాన్ని నమ్మలేకపోతున్నాను. దక్షిణాఫ్రికా ఐపీఎల్ లో నేను డాల్ఫిన్స్ (క్వాజులూ నాటల్ ప్రావిన్స్) తరఫున ఆడాను. చెన్నై కు వ్యతిరేకంగా వార్మప్ మ్యాచ్ ఆడాం. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. అందుకే నేను ఎప్పుడూ ఎల్లో టీమ్ లో భాగం కావాలని కోరుకుంటాను’’ అన్నాడు డేవిడ్ మిల్లర్. ఎంఎల్ సీ లీగ్ కు బంగారు భవిష్యత్తు ఉందని మిల్లర్ అభిప్రాయపడ్డాడు. అన్ని ఇతర టీ20 లీగుల్లో తనకంటూ సుముచిత స్థానం దక్కించుకుంటుందన్నాడు. ప్రపంచ క్రికెట్ పై ఇది తన ప్రభావం చూపిస్తుందన్నాడు. ఇతర లీగ్ లకు ఉన్న మాదిరే ఎంఎల్ సీ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందని అభిప్రాయపడ్డాడు.


More Telugu News