500 కోట్ల మార్క్ దిశగా కదులుతున్న 'ఆదిపురుష్'

  • ఈ నెల 16వ తేదీన విడుదలైన 'ఆదిపురుష్'
  • దర్శకుడి మార్పుల పట్ల  విమర్శలు  
  • అయినా థియేటర్స్ దగ్గర తగ్గని సందడి 
  • ఈ వారంలోనే 500 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'ఆదిపురుష్' సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. వివిధ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి ఆటతోనే ఈ సినిమా విమర్శలను ఎదుర్కొంది. ఓమ్ రౌత్ చేసిన మార్పుల పట్ల చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

అయితే శ్రీరాముడిగా ప్రభాస్ ను .. సీతాదేవిగా కృతి సనన్ ను ప్రేక్షకులు అంగీకరించారు. ఇక హనుమంతుడిగా దేవ్ దత్త ఎక్కువ మార్కులే కొట్టేశాడు. అలాంటి ఈ సినిమా తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. చాలా ప్రాంతాల్లో 'ఆర్ ఆర్ ఆర్' తరువాత స్థానంలో నిలిచింది. 

ఇక 3 రోజుల్లో 340 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, చాలా తక్కువ సమయంలోనే 500 కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చూసినవారు రకరకాలుగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నప్పటికీ, ప్రభాస్ ఇమేజ్ .. రామాయణ నేపథ్యం కారణంగా మరింతమంది ఈ సినిమా చూడటానికి ఆసక్తిని చూపుతూనే ఉన్నారు. అందువల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టుకుంటోంది. ఇక దగ్గరలో 'ఆదిపురుష్' స్థాయికి తగిన సినిమా లేకపోవడం కూడా, ఈ సినిమాకి కలిసొచ్చే అంశం.


More Telugu News