అవును, ఎంపీ నిధులు సొంతానికి వాడుకున్నా.. తప్పా?: ఎంపీ సోయం బాపూరావు
- నిధుల దుర్వినియోగంపై ప్రజాప్రతినిధుల భేటీలో సంచలన వ్యాఖ్యలు
- ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇళ్లు కట్టుకున్నానని తేల్చిచెప్పిన బాపూరావు
- ఆ నిధులతోనే కుమారుడి పెళ్లి చేసినట్లు వెల్లడి
నియోజకవర్గ పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతోనే ఇల్లు కట్టుకున్నానని, కుమారుడి పెళ్లి చేశానని చెప్పుకొచ్చారు. ఈమేరకు బీజేపీ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఏడాది వచ్చిన ఎంపీ ల్యాడ్స్ నిధుల పంపకం కోసం ఎంపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘ఎంపీ నిధులను వాడుకుని ఇళ్లు కట్టుకున్నా. ఆ నిధులతోనే కుమారుడి పెళ్లి చేశా. నిధులు వాడుకోవడం తప్పా? గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నేనేమీ నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు. అభివృద్ధి కోసం మీకు నిధులు పంచకపోవడం వాస్తవమే. ఒక ఎంపీగా సొంత ఇళ్లు లేకపోతే గౌరవం ఉండదనే ఉద్దేశంతోనే ఆ నిధులతో ఇల్లు కట్టుకున్నా’ అని ఎంపీ సోయం బాపూరావు వెల్లడించారు.