‘పాదాల మీద నడిచే యాత్ర’ కు రేవంత్ రెడ్డి కౌంటర్
- గాంధీభవన్ లో మీడియా సమావేశంలో వ్యంగ్యం
- షర్మిల మాటలను యథాతథంగా పలికిన రేవంత్ రెడ్డి
- గతంలో పాదయాత్రకు వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల కొత్త నిర్వచనం
పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంటూ వైఎస్ ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ గా మారాయో తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ దీనిపై చాలామంది జోక్స్ వేస్తున్నారు. తాజాగా దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. షర్మిల వ్యాఖ్యలను అదేవిధంగా పలుకుతూ చుట్టూ ఉన్నవారిని నవ్వించారు.
గాంధీభవన్ లో ఇటీవల నిర్వహించిన సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరుకాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని, యాత్ర మొదలు పెట్టిన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా వాహనం ఎక్కలేదని వివరించారు. పాదాల మీద నడిచేది పాద యాత్ర కాబట్టి అంటూ నవ్వడంతో చుట్టూ ఉన్నవారు కూడా నవ్వాపుకోలేక పోయారు.
షర్మిల ఏమన్నారంటే..
తెలంగాణలో పాదయాత్ర చేపట్టిన షర్మిల.. ఓ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్నది అసలు పాదయాత్రే కాదని ఆరోపించారు. పాదయాత్ర అంటే.. పాదాల మీద నడిచే యాత్ర అంటూ నిర్వచించారు. తాను రోజుల తరబడి ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటూ వాహనాలు ఎక్కకుండా పాదాల మీద నడుస్తూ యాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు.