పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడనంటూనే.. పూనంకౌర్, రేణు దేశాయ్ ల పేర్లను ప్రస్తావించిన ద్వారంపూడి

  • పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్
  • పవన్ రెడ్డికుల ద్వేషి అంటూ విమర్శ
  • చంద్రబాబు నుంచి పవన్ కు ప్రాణహాని ఉందని వ్యాఖ్య
తన తాతను అప్పటి జిల్లా ఎస్పీ డీటీ నాయక్ బేడీలు వేసి తీసుకెళ్లారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. బేడీలు వేసి తీసుకెళ్లలేదని ఆయన అన్నారు. ఇదే కాకినాడలో నీ చేతికి బేడీలు వేసి కొట్టించగలనని, తన చేతికి బేడీలు వేయించడం నీ జన్మలో చేయలేవని అన్నారు. రాబోయే రోజుల్లో నీ సంగతి చూస్తానని హెచ్చరించారు. దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబును దేహీ అని అడుక్కుంటే, ఒకవేళ కాకినాడలో ఆయన నీకు సీటు ఇస్తే, వచ్చి పోటీ చెయ్ అని సవాల్ విసిరారు. నిన్ను తుక్కుతుక్కుగా ఓడిస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ రెడ్డి సామాజికవర్గ ద్వేషి అని వ్యాఖ్యానించారు. 

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను అంటూనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పూనంకౌర్, రేణు దేశాయ్ లు బయటకు వచ్చి మాట్లాడతాం అంటున్నారని... ఆయన పర్సనల్ లైఫ్ గురించి తాను కూడా మాట్లాడగలనని, కానీ మాట్లాడనని చెప్పారు. పవన్ డ్రగ్స్ వాడతారని ఇండస్ట్రీలో అనుకుంటుంటారని... అయితే ఈ విషయంలో తనకు క్లారిటీ లేదని, అందుకే దీని గురించి తాను మాట్లాడనని అన్నారు. 

కాకినాడలో తనను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నీవు ఓడిపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబును అడిగి వెంటనే టికెట్ ప్రకటించుకోవాలని, తాను జగన్ ను అడిగి టికెట్ తెప్పించుకుంటానని చెప్పారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని అన్నారు.


More Telugu News