జీ 5 కోసం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 'మిషన్ తషాఫి'
- యాక్షన్ కథలపైనే ప్రవీణ్ సత్తారు దృష్టి
- వెబ్ సిరీస్ గా రూపొందుతున్న 'మిషన్ తమాషి'
- ప్రధానమైన పాత్రల వెల్లడి త్వరలోనే
- 8 ఎపిసోడ్స్ గా రానున్న వెబ్ సిరీస్
ప్రవీణ్ సత్తారు మొదటి నుంచి కూడా యాక్షన్ కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. రాజశేఖర్ .. నాగార్జున లతో యాక్షన్ సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చిన ఆయన, వరుణ్ తేజ్ హీరోగా 'గాండీవధారి అర్జున' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రవీణ్ సత్తారు జీ 5 కోసం ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు .. ఆ వెబ్ సిరీస్ పేరే 'మిషన్ తషాఫీ'. ప్రణవి రెడ్డి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూటింగు మొన్న శనివారం నుంచి జరుగుతోంది. ప్రధానమైన పాత్రధారుల జాబితాను ఇంకా చెప్పలేదు.
ఇతర ముఖ్యమైన పాత్రలలో సిమ్రన్ చౌదరి .. శ్రీకాంత్ అయ్యంగార్ .. అనీష్ కురువిల్లా వంటి వారు కనిపించనున్నారు. జీ 5వారు నిర్మిస్తున్న ఈ సిరీస్ ను సీజన్ 1 క్రింద 8 ఎపిసోడ్స్ ను వదలనున్నారు. ఇంతవరకూ కెమెరా పెట్టని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగు జరుపుతుండటం విశేషం.