నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. ఐదుగురి మృతి
- మరో 28 మంది గల్లంతు
- దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
- విరిగిపడుతున్న కొండచరియలు
నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 28 మంది గల్లంతయ్యారు. చైన్‌పూర్ మునిసిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో సూపర్ హేవా హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద వరదలు సంభవించి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి.
చైన్‌పూర్, పంచ్‌ఖపన్ మునిసిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహనాన్ని అడ్డుకోవడం వల్లే వరదలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే దేశంలో ప్రవేశించిన రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.