గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు కన్నుమూత
- 1959లో సోషలిస్టు పార్టీ తరపున పోటీ చేసి విజయం
- 1962లో కాంగ్రెస్ తరపున గెలుపు
- నేడు చల్లపేటలో అంత్యక్రియలు
విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. స్వగ్రామం మెంటాడ మండలంలోని చల్లపేట. కొన్నేళ్లుగా గజపతినగరంలో ఉంటున్న ఆయన వారం రోజుల క్రితం బాత్రూంలో జారిపడడంతో గాయపడ్డారు. విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.
సన్యాసినాయుడు 1959లో సోషలిస్టు పార్టీ తరపున, 1962లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. సన్యాసినాయుడు పెద్ద కుమారుడు తాడ్డి వెంకట్రావు 1999లో గజపతినగరం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. 2005 వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సన్యాసినాయుడు అంత్యక్రియలు నేడు స్వగ్రామం చల్లపేటలో జరగనున్నాయి.