ఏపీలో కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు

  • కొత్త పార్టీ పెడుతున్న వ్యాపారవేత్త రామచంద్రయాదవ్
  • జులై 23న నాగార్జున వర్సిటీ వద్ద ప్రజా సింహగర్జన సభ
  • అదే రోజున పార్టీ పేరు ప్రకటన
ఏపీలో ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో, ఓ కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రయాదవ్ ఈ పార్టీని స్థాపించనున్నారు. జులై 23న పార్టీ  పేరును ప్రకటించనున్నారు. 

నాగార్జున యూనివర్సిటీ ముందు ఉన్న స్థలంలో జులై 23న ప్రజా సింహగర్జన సభ పేరిట పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు రామచంద్రయాదవ్ వివరాలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు అవసరమని, తమ కొత్త పార్టీ ఏపీలో నవశకాన్ని తీసుకురానుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన రాజకీయాల్లో తమ ప్రత్యర్థి ఎవరో చెప్పకనే చెప్పేశారు. ఏపీలో దోపిడీ పాలన నడుస్తోందని, ఒక ఫ్యాక్షన్ నాయకుడు అధికారంలోకి రావడం దురదృష్టకరమని రామచంద్రయాదవ్ పేర్కొన్నారు. వైసీపీ నేతలు వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని, వైసీపీ గద్దెనెక్కాక ఒక్క సాగునీటి ప్రాజెక్టుల్లోనే రూ.30 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.


More Telugu News